![]() |
![]() |

త్వరలో స్టార్ మాలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ కాబాతోంది. అదే "ఏ దేవి వరము నీవు " అనేదే ఆ కొత్త సీరియల్ . ఇందులో మెయిన్ లీడ్ గా సంజన గల్రాని నటిస్తోంది. రీసెంట్ గా స్టార్ మా ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేసింది. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామంలో "శబరి అనాధ శరణాలయం " కనిపిస్తుంది. దాన్ని ఒక వృద్ధురాలు నడుపుతూ ఉంటుంది. అక్కడే ఒక అందమైన పాతికేళ్ల వయసున్న అమ్మాయి కొంతమంది అనాధలతో కలిసి ఆటలు ఆడుతూ కనిపిస్తుంది.
తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. లడ్డూలు చేశా అంటూ ఉప్మా లడ్డూలు పెట్టి వాళ్ళను సరదాగా ఆటపాటలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది విలన్లు వస్తారు. ఆ అనాధాశ్రమం ఖాళీ చేయాలని చెప్పి బెదిరించి వెళ్తారు. ఆ అందమైన హీరోయిన్ వచ్చి కంగారు పడొద్దని అంతా చూసుకుంటానని చెప్పింది. ఐతే ఆ వృద్ధురాలు వచ్చి " అమ్మా అంజలి ఈ ఆశ్రమం కథ ముగిసిపోయింది. నీ కథ ఇప్పుడే మొదలవుతుంది. నేను పాతికేళ్ళు దాచిన నిజాన్ని చెప్తాను . నీకు ఒక కుటుంబం ఉంది" అని చెప్పి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్తఅంతా ా నీకు తెలుస్తుంది అని పంపించేస్తుంది.
ఇక అంజలి అక్కడికి వెళ్లి డోర్ కొడుతోంది. తలుపు ఇవతల అంజలి అవతల సంజనని చూపించారు. "భవిష్యత్తును వెతుక్కుంటూ వచ్చిన కూతురు..తల్లి పాతికేళ్ల ప్రశాంతతను కల్లోలంగా మారుస్తుందా ? అంటూ ఈ సీరియల్ ప్రోమో వచ్చింది. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా వచ్చింది సంజనా. ఆమె చుట్టూనే హౌస్ లో కాంట్రోవర్సి లు నడిచాయి. బిగ్ బాస్ తో పాపులర్ అయ్యేసరికి సంజనకు సినిమా అవకాశాలు లేకపోయినా బుల్లితెర మీద వరసగా అవకాశాలు వస్తున్నాయి.
![]() |
![]() |